
రాజకీయ వేదికపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరియు నటుడు ప్రకాశ్ రాజ్… వెండితెరపై మాత్రం అసలైన కెమిస్ట్రీని చూపించారు. ఈ ఇద్దరూ కీలక పాత్రల్లో నటించిన “ఓజీ” బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించగా, విజయోత్సవ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
పవన్ స్పష్టం చేస్తూ —
“సినిమా నాకు అమ్మ లాంటిది. ఎవరి రాజకీయ అభిప్రాయాలకైనా నేను నటన నుంచి వెనక్కి తగ్గను. ప్రకాశ్ రాజ్‌తో కలిసి నటిస్తారా? అని అడిగినప్పుడు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను. కానీ, ఒకే ఒక షరతు పెట్టాను — సెట్‌లో రాజకీయ చర్చలు అస్సలు జరగకూడదు! ఆయన తన వృత్తిని గౌరవిస్తే, నేను కూడా అలాగే గౌరవిస్తాను” అన్నారు.
అంతే కాకుండా, ప్రకాశ్ రాజ్‌ను “బ్రిలియంట్ యాక్టర్” అంటూ పొగడ్తలతో ముంచెత్తిన పవన్, “మా మధ్య ఏమైనా రాజకీయ విబేధాలు ఉంటే అవి బయట పరిష్కరించుకుంటాం, కానీ సినిమా సెట్‌లో కాదు” అని స్పష్టం చేశారు.
సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే పవన్, ఈసారి ప్రత్యర్థిని పొగడటమే కాదు, వృత్తిపరమైన తన ధోరణిని మరోసారి చాటుకున్నారు.
‘ఓజీ’లో ప్రకాశ్ రాజ్ చేసిన సత్యదాదా పాత్ర, పవన్ చేసిన గంభీర్ రోల్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే.
