అనిల్ రావిపూడి – వెంకటేశ్ కాంబినేషన్ లో రూపొందిన మరో కామెడీ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ . దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, నిన్న సంక్రాంతి రోజునే విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మార్నింగ్ షో నుంచే మంచి టాక్ వచ్చింది. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్ 2’ .. ‘ఎఫ్ 3’ సినిమాలు భారీ విజయాలను అందుకోవటం ప్లస్ అయ్యింది. ఈ సినిమాతో ఈ ముగ్గురూ కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టడం జరిగింది. ఎంతలా అంటే ఈ సినిమా వెంకటేష్ గత చిత్రం సైంధవ్ క్లోజింగ్ కలెక్షన్స్ కు మూడు రెట్లు ఓపినింగ్స్ వచ్చాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. వెంకీకి ఇవే ఆల్‌టైమ్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని తెలిపింది. ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ కలిసి దీనిని నిర్మించారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకన్నా ముందు వెంకటేష్ ఎన్నో నమ్మకాలు పెట్టుకుని చేసిన చిత్రం సైంధవ్. హీరో వెంకటేష్. హిట్ పేరుతోనే రెండు హిట్లు కొట్టేసిన డైరెక్టర్ శైలేశ్ కొలను. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే ‘సైంధవ్’. ఇది వెంకటేష్‌కి 75వ చిత్రం కావడం మరో విశేషం.

అయితే వెంకీ మామ రికార్డ్ సినిమాని శైలేశ్ పాడు చేసారు. సంక్రాంతి బరిలోకి దిగిన సైంధవ్ డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చారు. సినిమా మొత్తం హై యాక్షన్ సీన్లు చేయిస్తూనే వెంకీ మార్క్ ఎమోషన్, సెంటిమెంట్‌ను బయటికి తీశాడు.
సైంధవ్ సినిమా మొత్తం చాలా స్టైలిష్‌గా ఉంది. కానీ ఫలితం లేదు. సామాన్యుడుకి ఈ సినిమా ఎక్కలేదు. హిట్ సిరీస్‌లో స్క్రీన్‌ప్లేనే పెద్ద బలం.. సైంధవ్‌కి కూడా అలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉండి ఉంటే ఇంకా బాగుండేదని రివ్యూలు వచ్చాయి.
ఫైనల్ గా వెంకీకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ తో ప్రస్తుతం కామెడీ సినిమాలే బాగా కలిసొస్తున్నాయని తేలిపోయింది.