ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్న రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం కథలు,వింటున్నారు డైరక్టర్స్ ని కలుస్తున్నారు. మరో ప్రక్క రాత్రి, పగలు అన్న తేడా లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

ఈ చిత్రం అవ్వగానే సుకుమార్ ప్రాజెక్ట్ ఉంటుంది. వచ్చే ఏడాదిలో షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇక్కడి వరకు అందరికీ క్లారిటీ అయితే ఉంది. అయితే రామ్ చరణ్ లైనప్ మీద రకరకాల వార్తలు వస్తున్నాయి.

సుకుమార్ తర్వాత ప్రాజెక్టు కిల్ డైరక్టర్ నిఖిల్ న‌గేశ్ భ‌ట్ తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం రామ్ చ‌ర‌ణ్‌ను ఎంపిక చేసుకున్న‌ట్లు చెప్తున్నారు. మైథాలాజిక‌ల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం రామ్ చ‌ర‌ణ్‌తో నిఖిల్ చ‌ర్చ‌లు జరుపుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ విషయాన్ని ఖండించారు. అసలు రామ్ చరణ్ నే కలవలేదు. ఇలాంటి వార్తలు ఎలా వచ్చాయని ఆశ్చర్యపోయారు. దాంతో సుకుమార్ తర్వాత రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్‌ ఏంటనేది మళ్లీ పజిల్ గా మారింది. మరో ప్రక్క కిల్ డైరక్టర్ తో సినిమా అనగానే ఫ్యాన్స్ చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇందులో రామ్ చరణ్‌ను నెవ్వర్ బిఫోర్ చూపిస్తాడని అనుకున్నారు. అయితే ఇప్పుడు నిరాశ ఎదురైంది వారికి.

,
You may also like
Latest Posts from