బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ అందుకున్న ఛావా సినిమాను తెలుగులో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. మార్చి 07న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హిందీ లో ఊహకందని రికార్డులను అన్ సీజన్ లో నమోదు చేస్తూ దూసుకు పోతున్న ఈ చిత్రం తెలుగులోనూ బాగానే వర్కవుట్ అయ్యేలా కనపడుతోంది. విక్కీ కౌశల్(Vicky Kaushal) లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) తెలుగు లో డబ్ అయ్యి ఈ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
తెలుగు లో సినిమా మీద మంచి ఎక్సపెక్టేషన్స్ ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ ఇప్పుడు అంచనాలను ఇంకా మించి పోయే రేంజ్ లో దూసుకు పోతూ ఉండటం విశేషం. సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఉన్న ట్రెండ్ ను చూసి… 1.2-1.4 కోట్ల రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతుంది అనుకున్నారు.
కానీ ఊహించని విధంగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ఎక్స్ లెంట్ గా జోరు చూపెట్టింది. ఛావా సినిమా మొదటి రోజు మొత్తం మీద డే కంప్లీట్ అయ్యే టైంకి 1.7-1.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ దిశగా దూసుకు పోయిందని తెలుస్తోంది. అయితే అఫీషియల్ లెక్కలు ఇంకా బయిటకు రాలేదు.
తెలుగు లో సినిమాను గ్రాండ్ గా ఇప్పుడు రిలీజ్ చేయగా…రిలీజ్ కి 2 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ సినిమాకి ఓపెన్ అవ్వగా కొత్త సినిమాలలోకి బెస్ట్ అనిపించే రేంజ్ లో ఆల్ మోస్ట్ 20 వేలకు పైగా ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తోందీ సినిమా.