ఈ మ‌ధ్య కాలంలో ప్రమోషన్స్ తోనే అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన చిన్న చిత్రాల్లో ‘బ్రహ్మా ఆనందం’ ఒక‌టి. హాస్య న‌టుడు బ్ర‌హ్మానందం (Brahmanandam) పేరుతోనే వ‌చ్చిన సినిమా కావ‌డం.. ఇందులో ఆయ‌న, త‌న త‌నయుడు రాజా గౌత‌మ్ తాత‌-మ‌న‌వ‌ళ్లుగా ప్రధాన పాత్రల్లో న‌టించ‌డం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

‘మ‌ళ్లీరావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ‌’, ‘మ‌సూద’ లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని అందించిన రాహుల్ యాద‌వ్ దీన్ని నిర్మించ‌డం.. ప్రభాస్‌, చిరంజీవి (Chiranjeevi) లాంటి స్టార్స్ దీని కోసం ప్రచారం చేయ‌డం.. ఇలా ప‌లు ర‌కాలుగా ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆక‌ర్షించింది. దీనికి త‌గ్గట్లుగానే టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తో పాటు పాట‌లు అల‌రించ‌డంతో దీనిపై ఉన్న అంచ‌నాలు రెట్టింప‌య్యాయి.

ఆర్‌వీఎస్ నిఖిల్‌ దర్శకత్వం వహించిన ఈ కుటుంబ కథాచిత్రం గతనెల 14న థియేటర్లలో విడుదలైంది. బ్రహ్మానందం యాక్టింగ్‌, కామెడీ టైమింగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ సినిమాగా వర్కవుట్ కాలేదు. కలెక్షన్స్ రప్పించలేకపోయిందీ సినిమా. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి రానుంది.

ఆహా ఓటిటిలో ఇది మార్చి 14 నుంచి స్ట్రీమింగ్‌ (Brahma Anandam OTT Release) కానుందని టీమ్‌ వెల్లడించింది.

, , , ,
You may also like
Latest Posts from