వరుణ్ తేజ్ హీరోగా ‘వీటీ 15’(వర్కింగ్ టైటిల్) సినిమా షురూ అయింది. రితిక నాయక్ హీరోయిన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లోప్రారంభమైంది. ఈ సినిమా హారర్ కామెడీ జానర్లో రానున్నట్లు తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.
ఈసారి మనం వెళ్లే రూట్ ఎక్స్ప్రెస్ రూట్ అంటూ కమెడియన్ సత్యతో కలిసి వరుణ్ నవ్వులు పూయించారు. సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపారు.
‘‘ఇండో–కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతోన్న చిత్రం ‘వీటీ 15’. సోమవారం నుంచే హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ప్రారంభించాం. వరుణ్ తేజ్ సరికొత్త పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుంది’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: తమన్.