ప్యాన్ ఇండియా మార్కెట్ వచ్చాక స్టార్ హీరోలు తామేంటో ,తన ఒరిజినాలిటీతో ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ క్రమంలో దేశం మొత్తం ప్రమోషన్స్ కు వెళ్తున్నారు హీరోలు. అంతేకాదు అవకాసం ఉంటే తమ సినిమాల ఇతర భాషల భాషల డబ్బింగ్ చెప్పటానికి వెనకాడటం లేదు. ఆ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్ తన తాజా చిత్రానికి హిందీ డబ్బింగ్ చెప్తున్నారుని సమాచారం. ముందుగా పెద్ది హిందీ టీజర్ కు డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. ఇది రామ్ చరణ్ అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది.
రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోన్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని టీమ్ తాజాగా ‘పెద్ది గ్లింప్స్’ (Peddi Glimpse) విడుదల చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
సినిమాలో రామ్‌చరణ్ పాత్ర ఏవిధంగా ఉండనుందో ఈవీడియోతో టీమ్ తెలియజేసింది. మాస్ అవతార్‌లో చరణ్ లుక్ ప్రేక్షకులకు కన్నుల పండుగగా అనిపించింది.
‘ఏదైనా ఈ నేలమీద ఉన్నప్పుడే సేసేయాల.. పుడతామా ఏటి మళ్లీ..!’ అంటూ ఆయన ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్‌లు ఈలలు వేయించేలా ఉన్నాయి. ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో చరణ్ కొట్టిన సిక్స్ షాట్ మాత్రం వావ్ అనిపించేలా ఉంది. రెహమాన్ ఈచిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఇది విడుదల కానుంది.