అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ కోర్ట్‌ రూమ్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2’ ఇటీవల హిందీలో విడుదలై మంచి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతితెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతోంది.

సురేశ్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను మే 23న తెలుగులో విడుదల చేయబోతుంది.

కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్. మాధవన్, అనన్య పాండే, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా కథ భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయం అయిన 1919 జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ బేస్ చేసుకుని నడుస్తుంది. ఆ కాలపు సంఘటనలు, వీరుల బలిపీఠాలు చిత్రీకరించడం ద్వారా ఈ సినిమా నెత్తుటి హృదయాలను మన ముందు ఉంచనుంది.

ఈ చిత్రం courtroom డ్రామాగా మాత్రమే కాదు, భారత దేశం కోసం పోరాటమాడిన వీర యోధుల త్యాగానికి నివాళిగా నిలుస్తోంది. దేశభక్తితో కూడిన కథ, అద్బుతమైన నటనల సమ్మేళనంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటుందని భావించవచ్చు.

మే 23 న, ఈ చరిత్రాత్మక కథనాన్ని మన భాషలో చూడడానికి సిద్ధంగా ఉండండి!

, , ,
You may also like
Latest Posts from