నాచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటరైన చిత్రం ‘హిట్ 3’ . శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సాలిడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, థియేటర్స్‌లో సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, ప్రేక్షకుల మైండ్‌ల్లో కూడా బిగ్ హిట్‌గా మిగిలిపోయింది. అటువంటి ‘హిట్ 3’ ఇప్పుడు ఓటిటి దశకు అడుగుపెడుతోంది. స్ట్రీమింగ్ వివరాల్లోకి వెళితే…
ఈ చిత్రం ఓటిటిలో మే 29 నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ థియేట్రికల్ రన్ తర్వాత ఇప్పుడు ఓటిటిలో మరోసారి తన మ్యాజిక్ చూపించబోతుంది.
ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించగా, అడివి శేష్, కార్తీ, ఇతరులు ముఖ్యమైన క్యామియో రోల్స్‌లో కనిపించారు. షాకింగ్ ట్విస్ట్‌లు, డార్క ఎమోషన్స్, పవర్‌పుల్ బాక్స్ ఆఫీస్ రన్ – ‘హిట్ 3’ ఇప్పుడు ఇంట్లో స్క్రీన్‌పై ఏ మేరకు సంచలనాలు సృష్టించబోతోందో చూడాలి.