ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి హైప్ ఉంది. అయితే, టీజర్ వచ్చిన తర్వాత చాలా మంది టాప్ డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఒకింత వెనక్కి తగ్గారు. అదే రోజు రజనీకాంత్ ‘కూలీ’ కూడా రిలీజ్ కావడం కూడా పెద్ద స్ట్రాటజిక్ ఎలిమెంట్‌గా మారింది. దానికి తోడు రైట్స్ కు బాగా ఎక్కువ రేట్లు డిమాండ్ చేసారు నిర్మాతలు. ఈ నేఫధ్యంలో అందరి నుండి వెనకడుగు పడిన ఈ సమయంలో, ఎన్టీఆర్ మాటలే వార్ 2 తెలుగు రైట్స్‌ను ముందుకు నడిపించాయని సమాచారం!
యంగ్ ప్రొడ్యూసర్ ఎస్. నాగవంశీ ఇప్పటికే ఎన్టీఆర్ యొక్క “దేవర” తెలుగు హక్కులను సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేశారు. బిజినెస్ విషయంలో ఓ స్టైలిష్ మూడ్‌లో దాన్ని విభిన్నంగా ఆపరేట్ చేసిన వంశీపై ఎన్టీఆర్‌కు మంచి నమ్మకం ఏర్పడింది. అందుకే తారక్ స్వయంగా వంశీని ముంబయికి పిలిపించి, వార్ 2 తెలుగు రైట్స్ తీసుకోమని సజెస్ట్ చేశారని వినికిడి.
అంతేకాకుండా — తారక్ స్వయంగా వంశీకి యాష్‌రాజ్ ఫిల్మ్స్ ని పరిచయం చేశారు. ఈ కీలక మీటింగ్ రెండు నెలల క్రితమే జరిగింది. తారక్ అంటే పిచ్చి అభిమానిగానే పేరున్న వంశీ, తారక్ చెప్పగానే ఒక్క నిమిషం కూడా వెనక్కి తాడలేదు. పెద్ద మొత్తంలో చెల్లించాల్సిన భారీ డీల్ అయినా సరే — వంశీ, తారక్ కోసం ఒక అడుగు ముందుకేసాడు.
వార్ 2 డైరెక్షన్‌ను అయాన్ ముఖర్జీ నిర్వహిస్తుండగా, యాక్షన్, స్కేల్, స్టార్ పావర్ పరంగా ఈ సినిమా యష్‌రాజ్ స్పై యూనివర్స్‌లో మరో మైలురాయిగా నిలవబోతోంది. తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎన్టీఆర్ సినిమా అంటే ఉన్న ఇంటెన్స్ క్రేజ్‌తో పాటు, హృతిక్ రోషన్‌తో ఆయన పంచుకునే స్క్రీన్ పర్సనాలిటీకి టాలీవుడ్ ఫ్యాన్స్‌లో స్పెషల్ వెయిటింగ్ ఉంది.
ఈ సినిమా తెలుగు హక్కులు ఓ సాధారణ డీల్ కాదు. ఇది తారక్ – వంశీ మధ్య నమ్మకం, అభిమానం, వ్యూహం కలిసిన డైనమిక్ మూవ్ అని చెప్పొచ్చు. మొత్తానికి, వార్ 2 కి తెలుగులో ట్రేడ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి … తారక్ బ్రాండ్, వంశీ కసి కలిసిన ఈ అడుగు మాత్రం తెగించి వేసినదే అంటున్నారు!