నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తయ్యే దశకు చేరింది. గతంలో చిత్ర టీమ్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 25న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించింది. అదే రోజున పవన్ కళ్యాణ్ ‘OG’ కూడా రిలీజ్ కావడంతో రెండు సినిమాలపై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

అయితే… ఇప్పుడు ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా పడనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో నిర్మాతలు ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, వీసీ వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడం వల్ల డిసెంబరుకు తరలించే అవకాశాలు ఉన్నాయన్న వదంతులు వస్తున్నాయి.

ఇంకా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ కానుందని తెలిసింది. ఇది ‘అఖండ 2’ రిలీజ్ పై మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం అఖండ టీమ్ మాత్రం సెప్టెంబర్ 25 డెడ్‌లైన్ కోసం కష్టపడుతూనే ఉంది. కానీ వీఎఫ్ఎక్స్ ఆలస్యమైతే దసరా బరిలోంచి బయటపడే ప్రమాదం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

దసరా రిలీజ్ కేలెండర్ గురించి స్పష్టతకు ఆగస్టు చివరలో అధికారిక ప్రకటనలు రావొచ్చని ఊహించబడుతోంది. అప్పటిదాకా వదంతులే!

మొత్తానికి, బాలయ్య మాస్ పవర్ ఎప్పుడొస్తుందో.. ఆ ఖచ్చితమైన తేదీ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు!

, , , ,
You may also like
Latest Posts from