ఈ మధ్యకాలంలో మోస్ట్ హైప్ క్రియేట్ చేసిన సినిమాల్లో ‘కూలీ’ ఒకటి. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్, ఫస్ట్ లుక్ నుండి సాంగ్స్ వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అన్నీ అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటున్నాయి. స్పెషల్‌గా సౌబిన్ షాహిర్ డాన్స్ మూవ్స్, పూజా హెగ్డే గ్లామర్ ప్రెజెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన ‘మోనికా’ సాంగ్ చార్ట్ బస్టర్ అయిపోయింది.

ఈ బజ్‌కి తగినట్టుగానే ట్రేడ్ సర్కిళ్లలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం, కర్ణాటక ఏరియా హక్కులు రూ.23 కోట్లుకి అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇది ఒక రికార్డ్ లెవల్ డీల్ అనే చెప్పాలి. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ‘కూలీ’కు కనీసం రూ.50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రావాలి.

ఇంకా ‘వార్ 2’ వంటి పోటీ సినిమాలున్నా, అన్ని ఏరియాల్లో ‘కూలీ’కి మాస్ బిజినెస్ జరుగుతుండటం విశేషమే. రజనీ మాస్ ఇమేజ్, లోకేష్ స్టైల్ మేకింగ్, అదిరిపోయే సాంగ్స్‌… ఇవన్నీ కలసి ఈ సినిమాపై అంచనాలను మామూలుగా పెంచలేదు.

మొత్తానికి ‘కూలీ’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ మాస్ సెన్సేషన్‌గా మారింది!

, , , ,
You may also like
Latest Posts from