ఒకప్పటి దేవతా సినిమాల బలాన్ని కొత్తరకంగా చూపించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతారా. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి న్యాచురల్ మిస్టిసిజం, గ్రామీణ ఆధ్యాత్మికత, జానపద గాథల మేళవింపుతో తెరకెక్కించిన ఈ చిత్రం, పాన్-ఇండియా స్థాయిలో కలెక్షన్ల పరంగా కాదు – కల్చరల్ ఎఫెక్ట్ పరంగానూ ఘనవిజయం సాధించింది.
ఇప్పుడు రిషబ్ మరోసారి కాంతారా 2 ద్వారా తన ఫోక్ లారే యూనివర్స్‌ని విస్తరించేందుకు రెడీ అవుతున్నారు. కానీ అసలైన బాంబ్ ఎక్కడ ఉంది అంటే… కాంతారా 3 ప్లాన్లో! ఈ చిత్రానికి రిషబ్ మరింత స్కేలు, మరింత స్టార్డమ్ అందించాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే – ఒక పెద్ద తెలుగు స్టార్‌ని onboard చేసే ఆలోచన ఉందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ స్టార్ మరెవరో కాదు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల రిషబ్ – ఎన్టీఆర్ మధ్య ఓ ప్రత్యేక సమావేశం కూడా జరిగిందట. అది స్నేహంగా జరిగిన సమావేశమే అయినా, అప్పుడే కాంతారా 3 కి సంబంధించి ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. మోస్ట్ ఇంట్రిగ్యూయింగ్ పార్ట్ ఏంటంటే – కాంతారా 2 నుంచే ఎన్టీఆర్ పాత్రకు లీడ్ ఇవ్వొచ్చని, చిన్న హింట్ ఇవ్వొచ్చని బజ్ ఉంది!
అయితే, కాంతారా 3 మాత్రం వెంటనే మొదలయ్యే సినిమేం కాదు. ముందు రిషబ్ శెట్టి మరో ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేస్తున్నారు – సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న, అశ్విన్ గంగరాజు డైరెక్ట్ చేయబోయే సినిమా అది. ఈ సినిమా తర్వాతే రిషబ్ కాంతారా 3 పై దృష్టి పెట్టనున్నారు.
కాని ఒక్కసారిగా ఈ వార్తలు నిజమైతే? ఎన్టీఆర్‌కి రిషబ్ శెట్టి వంటి మిస్టిక్ మేకర్ కలిస్తే? యాక్షన్‌తో అగ్గిపుల్లలా మండే ఎన్టీఆర్ ..ఓ డివైన్ యూనివర్స్‌లోకి అడుగుపెడితే? తెలుగు-కన్నడ ఫ్యాన్స్‌కి ఇది కలల కాంబినేషన్. అది బాక్సాఫీస్ స్థాయిని దాటిపోయి, లెజెండ్ స్థాయికి వెళ్లే ప్రాజెక్ట్ అవుతుంది!