నటసామ్రాట్ నాగార్జున… మళ్లీ ఒకసారి ఇండియన్ సినిమాల్లో ఎందుకు వెర్సటైల్ స్టార్ అనిపించుకున్నారో చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబోలో వచ్చిన కుబేరాలో లేయర్డ్, అన్‌కన్వెన్షనల్ క్యారెక్టర్‌తో ఆడియెన్స్‌ని సర్‌ప్రైజ్ చేసిన నాగ్, ఇప్పుడు కూలీలో అందరినీ షాక్‌కి గురిచేశారు.
తన కెరీర్‌లో ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ యాంటగనిస్ట్ పాత్రను ఫస్ట్ టైమ్ పోషిస్తూ – సైమన్ గా స్క్రీన్‌పై ఎంటర్ అయిన వెంటనే ఆడియెన్స్ కళ్లన్నీ తనవైపు తిప్పేసుకున్నారు. రజనీ – లోకేశ్ కనగరాజ్ మాస్ మైండ్‌లో రూపొందిన ఈ హై ఆక్టేన్ ఎంటర్టైనర్‌లో, సైమన్ అనేది ఓ రొటీన్ విలన్ కాదు… షో స్టీలర్!
అనిరుధ్ కంపోజ్ చేసిన ట్రాక్ “I Am The Danger” లో నాగ్ చూపించిన స్వాగ్, అటిట్యూడ్ – చార్మ్ కలిపి పర్ఫెక్ట్ విలన్ వైబ్‌ని క్రియేట్ చేసింది. నాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే కాకుండా, కథ టెన్షన్‌ని కొత్త స్థాయికి తీసుకెళ్లాడు.
ఫ్యాన్స్, క్రిటిక్స్ ఇద్దరూ “ఇది రీసెంట్ టైమ్స్‌లో బెస్ట్ క్యాస్టింగ్” అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. హీరో ఇమేజ్ నుంచి బయటికి వచ్చి ఇంత బోల్డ్ రోల్ చేయడం నిజంగా రిస్క్… కానీ ఆ గ్యాంబుల్ బిగ్ టైమ్ పే ఆఫ్ అయింది.
రిజల్ట్? కూలీ ఓపెనింగ్ డేలోనే ₹150 కోట్ల భారీ కలెక్షన్! అందులో హాట్ టాపిక్? సైమన్ – నాగ్ విలన్ స్వాగ్!
కుబేరా – కూలీ బ్యాక్ టు బ్యాక్ ఇంపాక్ట్‌ఫుల్ రోల్స్‌తో నాగార్జున తన స్క్రీన్ ఇమేజ్‌ని రీడిఫైన్ చేస్తూ, రీ-ఇన్వెన్షన్‌నే తన అసలైన సూపర్ పవర్‌గా మరోసారి ప్రూవ్ చేశారు.