
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2.బాలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వార్ 2 చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో భారీ తారాగణం నటించడం విశేషం. తారక్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, ఆషుతోషు రాణా ప్రధాన పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేశారు.
విదేశాల్లో భారీ యాక్షన్ సీన్లను చిత్రీకరించారు. దీంతో భారీగానే ఖర్చైంది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలన్నీ కలుపుకొని సినిమాకు రూ.400 కోట్ల బడ్జెట్ అయ్యింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు.
ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. మొదటి వారం జోరుగా వసూళ్లు సాధించిన ఈచిత్రం ఇక 2వ వారానికి తగ్గిపోయింది. ఇక 3వ వారంలో మరీ వసూళ్లు తగ్గిపోయాయి. దాంతో నష్టాల్లో పడింది. సినిమాకు నెగిటివ్ టాక్ రావటంతో చాలా మంది ఈ సినిమాని ఓటిటిలోకి వచ్చాక చూద్దాంలే అనుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.
హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వార్ 2’ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై భారీ అంచనాలు ఉన్నా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓటిటి అప్‌డేట్ బయటకొచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ ఈ యాక్షన్ డ్రామా డిజిటల్ రైట్స్‌ని సొంతం చేసుకుంది. అక్టోబర్ 9 నుంచి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో మరో ఎంట్రీ. ఇప్పటికే ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’, ‘టైగర్ 3’ లాంటి సినిమాలు ఈ యూనివర్స్‌లో భాగం.
ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ సౌత్-నార్త్ కాంబినేషన్ వల్ల ఫ్యాన్స్‌లో భారీ క్రేజ్ క్రియేట్ అయినా, థియేటర్లలో మాత్రం ఆ మేజిక్ జరగలేదు. అయితే ఓటిటిలో ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్!
