బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ అంటే తెలియని వారు లేరు. నార్త్, సౌత్ రెండు ఇండస్ట్రీల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి స్టార్ కూతురినే ఓ అపరిచితుడు “నగ్న ఫోటోలు పంపు” అంటూ బెదిరించాడని విషయం బయటపడింది. బయటికి వస్తే బాడీగార్డుల నడుమే కనిపించే అక్షయ్ కుమార్ ఫ్యామిలీకి ఇలా జరిగిందంటే ఇది నిజంగా షాకింగ్ అనిపించక మానదు.

సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లో అక్షయ్ కుమార్ బాంబ్ షెల్

తాజాగా ముంబైలో జరిగిన సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అక్షయ్ కుమార్, ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. “సైబర్ నేరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి, అందులో పిల్లలు పెద్దగా బలైపోతున్నారు. నా కూతురికీ ఇదే అనుభవం ఎదురైంది” అని షాకింగ్ రివిలేషన్ చేశారు.

వీడియో గేమ్‌లో మొదలైన బెదిరింపు

అక్షయ్ కుమార్ వివరాల ప్రకారం – ఆయన కూతురు ఒక ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతుండగా ఓ అపరిచిత వ్యక్తి “నువ్వు అబ్బాయా లేక అమ్మాయా?” అని అడిగాడట. ఆమె “నేను అమ్మాయి” అని చెప్పగానే వెంటనే “అయితే నీ నగ్న ఫోటోలు పంపు” అంటూ మెసేజ్ చేశాడు. అయితే ధైర్యంగా వ్యవహరించిన ఆమె వెంటనే గేమ్ నుంచి లాగ్ అవుట్ అయి, ఆ విషయం తన తల్లికి చెప్పింది.

“స్కూళ్లలో సైబర్ పీరియడ్ తప్పనిసరి” – అక్షయ్ కుమార్ డిమాండ్

ఈ ఘటన తర్వాత అక్షయ్ కుమార్, పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గట్టిగా అన్నారు. ముఖ్యంగా 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రతి వారం సైబర్ పీరియడ్ తప్పనిసరి చేయాలని సీఎం మహారాష్ట్రకు అభ్యర్థించారు.

“వీధి నేరాల కంటే వేగంగా పెరుగుతున్నాయి సైబర్ క్రైమ్స్”

అక్షయ్ కుమార్ హెచ్చరిస్తూ – “ఈ నేరాలు వీధి నేరాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా టీనేజర్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. అందుకే పిల్లలకు అవగాహన కల్పించడం తప్పనిసరి” అన్నారు.

స్టార్ హీరో కూతురికే ఇలాంటి షాక్ అయితే… సామాన్యుల పరిస్థితి ఏంటి?
అక్షయ్ కుమార్ కూతురి సంఘటనతో మళ్లీ ఫోకస్‌లోకి వచ్చిన సైబర్ క్రైమ్ ప్రమాదం!

, , , , ,
You may also like
Latest Posts from