ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాకముందే దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ క్రియేట్ చేసింది. ‘అనిమల్’ సక్సెస్ తర్వాత వంగా నుంచి ఏమి వస్తుందా అనే ఆతృత ఉన్న ఫ్యాన్స్‌కు ఇప్పుడు కొత్త సర్ప్రైజ్ రూమర్ షాక్ ఇస్తోంది! ఆ రూమర్ ఏమిటి

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తీస్తున్న సినిమా ‘స్పిరిట్’. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తాడు. పవర్ ఫుల్ పోలీస్ లుక్ ఉండబోతుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. హీరోయిన్‌గా తొలుత దీపిక పదుకొణెని అనుకున్నారు కానీ చివరకు తృప్తి దిమ్రి వచ్చి చేరింది. చాన్నాళ్లుగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్‪‌లో ఉంది. అయితే ఈ చిత్రం గురించిన వార్తలు మాత్రం ఆగటం లేదు.

తాజా సమాచారం ప్రకారం, సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబెరాయ్‌తో కీలక నెగటివ్ రోల్‌ గురించి చర్చలు జరుపుతున్నాడట.

వివేక్ ఓబెరాయ్ ఇప్పటికే హిందీ సినిమాల్లో తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అలాంటి వ్యక్తి ప్రభాస్‌కు ఎదురుగా విలన్‌గా వస్తే – స్క్రీన్‌పై ఫైర్‌వర్క్స్ ఖాయం అంటున్నారు సినీ వర్గాలు.

ఇక అధికారిక అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉన్నా, ఈ వార్త మాత్రం ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. ‘స్పిరిట్’ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా, ప్రబలమైన ఎమోషన్, పవర్‌ఫుల్ నేరేటివ్‌తో ఉండబోతుందని టాక్.

మరో ప్రక్క డార్క్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని తీయబోతున్నారని సమాచారం. ఈ సినిమాకు కేవలం ఆరు నెలల్లో పూర్తి చేసేలా సందీప్ ప్లాన్ చేశాడని, గత మూవీస్‌తో పోలిస్తే ప్రభాస్ బరువు తగ్గి, డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు సంగతి పక్కనబెడితే రూమర్స్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఒకవేళ ఇవి గనక నిజమైతే మాత్రం అంచనాలు పెరగడం గ్యారంటీ.

, , , ,
You may also like
Latest Posts from