
బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, థ్రిల్లింగ్ కంటెంట్ వల్ల మంచి వర్డ్ ఆఫ్ మౌత్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హర్రర్ థ్రిల్లర్ కిష్కింధపురి ఇప్పుడు ఓటిటి లో భయానక వాతావరణాన్ని కొనసాగించడానికి సిద్ధమైంది. థియేటర్స్‌లో మిస్ అయినవాళ్లకు ఇప్పుడు పెద్ద గిఫ్ట్ లాంటి వార్త ఇది — సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయిపోయింది.
జీ5 ఈ సినిమాకు స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుని, అక్టోబర్ 17 నుంచి అధికారికంగా స్ట్రీమింగ్ ప్రారంభం చేయనుంది.
సినిమా కథలో హీరో హీరోయిన్లు (బెల్లంకొండ సాయి, అనుపమ పరమేశ్వరన్) “గోస్ట్ వాకింగ్ టూర్” పేరుతో హాంటెడ్ హౌస్‌లను ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు. థ్రిల్ కోసం వచ్చిన 11 మందిలో ముగ్గురు అక్కడికే చనిపోవడం, “ఇక్కడికి వచ్చిన వారిని ఎవరినీ వదలను” అనే వాయిస్ వినిపించడం వంటి సీక్వెన్సులు ప్రేక్షకుల్లో భయానక ఆసక్తిని రేపాయి.
ఈ రేడియో స్టేషన్‌లో ఏమి దాగి ఉందో, ఆ వాయిస్ ఎవరిదో, వీరంతా ఎందుకు అక్కడికి చేరుకున్నారో తెలుసుకోవాలంటే – ఈ అక్టోబర్ 17న జీ5లో స్ట్రీమ్ కాబోయే కిష్కింధపురి తప్పక చూడాల్సిందే.
హాంటెడ్ రేడియో, మిస్టీరియస్ వాయిస్, థ్రిల్లింగ్ మిస్టరీ – ఒకే చోట!
