ఈ రోజుల్లో సినిమా ఓపెనింగ్స్ కంటే ముందే డిజిటల్ డీల్స్ క్లోజ్ కావడం సాధారణమైపోయింది. సినిమా థియేటర్‌కు వెళ్లే అవసరం ఏముంది… రెండు వారాల్లో ఓటిటీలో వస్తుంది కదా అని చాలా మంది ఆడియన్స్ థియేటర్లకే మారు మొగ్గు చూపడం లేదు. ఈ ట్రెండ్‌లోనే దేశమంతా డిజిటల్ డీల్స్ మీద దృష్టి పెట్టినప్పుడు, ఒక వ్యక్తి మాత్రం వ్యతిరేక దిశలో నడిచాడు – ఆయనే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్!

తన తాజా చిత్రం ‘సీతారే జమీన్ పర్’ కోసం, డిజిటల్ రిలీజ్‌లను పూర్తిగా తిరస్కరించారు.

“ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే, ఆ అనుభూతిని ఎవరూ మిస్ కాకూడదు,” అని ఆమిర్ స్పష్టంగా చెప్పారు.

వాళ్ల ప్లాన్ ఎలాగంటే – ఎలాంటి హైక్ టికెట్ రేట్లు లేవు, ఎక్కువ షోలు వేయలేదు. మల్టీప్లెక్సులు కూడా సాధారణ స్కెడ్యూల్‌కి తగినట్లుగానే ప్లాన్ చేశాయి. ఆమిర్ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ఫలితంగా… రెండు వారాలు పూర్తయ్యేలోపే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి, మూడో సోమవారం కూడా గట్టిగా కలెక్షన్లు వచ్చాయి.

ఇటీవలి కాలంలో మూడో వారం సోమవారం కూడా హిందీ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ‘సీతారే జమీన్ పర’ మాత్రం ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తోంది. ఆమిర్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలు సినిమా ఫలితాన్ని నిర్ధారించడమే కాదు – ఆడియన్స్‌కు మళ్లీ థియేటర్ అనుభూతిని గుర్తు చేస్తాయన్న విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

ఈ చిత్రం తక్కువ బడ్జెట్‌తో రూపొందినప్పటికీ – కలెక్ట్ అయిన మొత్తం దృష్టిలో ఉంచుకుంటే, ఇది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్గా నిలవబోతోంది.

ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…
ఆమిర్ ఓటీటీ కాదు, యూట్యూబ్ పేమెంట్ మోడల్లో (Pay-per-view) ఈ సినిమాను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ దిశగా చర్చలు మొదలయ్యాయి.

థియేటర్లలో సినిమా చూసే సంస్కృతి మళ్లీ పునరుద్ధరించాలంటే, ఆమిర్ లాంటి హీరోల దెబ్బే అవసరం!

డిజిటల్ స్పీడ్‌కు బ్రేక్ వేసి, థియేటర్ అనుభూతికి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఇదే!

, ,
You may also like
Latest Posts from