తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన సూపర్‌స్టార్ మహేష్ బాబు… ప్రస్తుతం ఎస్‌.ఎస్‌. రాజమౌళి డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్-అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు దాదాపు మూడు ఏళ్ల సమయం కేటాయించబోతున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పాన్-ఇండియా స్థాయికి చేరినట్లే… రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఇంటర్నేషనల్ లెవల్ క్రేజ్ అందుకుంటారని టాక్!

కానీ… ఇక్కడే సెన్సేషన్ లీక్!

రాజమౌళి సినిమా పూర్తి కాగానే, మహేష్ బాబుతో తదుపరి సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొచ్చిందట. అది కూడా బిగ్ అడ్వాన్స్, టాప్ డైరెక్టర్ ఆఫర్ తో! ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రీ ఇప్పటికే లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్‌కుమార్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో టాక్స్ మొదలెట్టిందట.

మహేష్ బాబు ఇప్పటివరకు ఈ ఆఫర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, తిరస్కరించలేదూ. కానీ మైత్రీ వైపు నుంచి “ఎంత ఖర్చు అయినా పర్వాలేదు… రాజమౌళి తర్వాతి మహేష్ సినిమా మనదే కావాలి!” అన్న డీటర్మినేషన్ తో ముందుకెళ్తున్నారట.

ఈ కాంబినేషన్ కన్‌ఫర్మ్ అయితే, ఇది సౌత్, బాలీవుడ్ మాత్రమే కాదు… ఆసియా ఫిల్మ్ మార్కెట్‌లో కూడా హవా చేసే ప్రాజెక్ట్ అవుతుందని ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది.

, , , ,
You may also like
Latest Posts from