అఖండ’ చిత్రానికి కొనసాగింపుగా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతోన్న విషయం విదితమే. నందమూరి బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో సంయుక్తా మేనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.. ఆది పినిశెట్టి ఇందులో కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇక, తమన్ సంగీతం అందిస్తుంగా.. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నందమూరి అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2’ కి సంబంధించి పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం… ‘అఖండ 2’ డిసెంబర్ 5, 2025న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ డేట్ ఇప్పటికే మీడియా వర్గాలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కి తెలియజేసారు. ఇక త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.

సెప్టెంబర్‌ 25వ తేదీన సినిమాని విడుదల చేయాలని మొదట్లో నిర్ణయించినా.. రీరికార్డింగ్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ ఉండడంతో.. సినిమా విడుదలని వాయిదా వేస్తూ గతంలో వాయిదా వేశారు.. ఇప్పుడు అఖండ-2 డిసెంబర్ 5న విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ..

అంతే కాదు… దసరా పండుగ సందర్భంగా ఒక పవర్‌ఫుల్ టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బిజినెస్ సర్కిల్స్‌లో ఈ సినిమా మీద హైప్ పీక్‌కి చేరింది. అంతేకాదు, ఓ టాప్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో భారీ డీల్ కూడా కుదుర్చుకున్నారట.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్‌లో సంయుక్త, ‘బజరంగీ భాయిజాన్’ ఫేం హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఎస్ ఈ సినిమాకి మ్యూజిక్ మాంత్రికుడిగా నిలవబోతున్నాడు.

, , , ,
You may also like
Latest Posts from