కొందరు అదే పనిగా ట్రోలర్స్ కు స్టఫ్ ఇస్తూంటారు. వాళ్లలో కే.ఏ పాల్ , మంచు విష్ణు, మంచు లక్ష్మి వంటి వారు ముందు వరసలో ఉంటారు. అయితే తాజాగా అల్లు అరవింద్ పనిగట్టుకుని మరీ ట్రోలర్స్ కు స్టఫ్ ఇచ్చినట్లు మాట్లాడారు.

నాగచైతన్య తాజా చిత్రం ‘తండేల్‌’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి దిల్ రాజు హాజ‌ర‌య్యారు. అల్లు అర్జున్ తన గెస్ట్ దిల్ రాజుని కాస్త ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేసారు. అందులో భాగంగా ‘ఈవారం చాలా చేసేశాడు దిల్ రాజు ఓ సినిమాని ఇలా తీసి (గేమ్ చేంజ‌ర్‌) ఇంకో సినిమాకి ఎక్క‌డికో తీసుకెళ్లి (సంక్రాంతికి వ‌స్తున్నాం)..’ అంటూ రెండు సినిమాల్నీ పోల్చి నిప్పు పెట్టారు.

రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ తో ఫ్లాప్ ఇచ్చాడు అన్న‌ది అల్లు అర‌వింద్ చెప్ప‌ద‌ల‌చుకొన్న మాట‌ అని అందరికీ అర్దమైంది. గేమ్ చేంజ‌ర్’ పేరు ప్ర‌స్తావించ‌క‌పోయినా, అది ఆ సినిమా గురించే అన్న‌ది అర్థ‌మై ట్రోలింగ్ మొదలైంది.

వాస్తవానికి ‘గేమ్ చేంజ‌ర్’ ఫ్లాపే. ఇందులో వేరే మాట లేదు. కాకపోతే ఎవరైన ఆ విషయం వేలెత్తి చూపెడితే మెగా ఫ్యాన్స్ కు కాలుతుంది కదా. అదే జరిగింది.

దానికి తోడు ఓ ప్రక్కన మెగా ఫ్యాన్స్‌, బ‌న్నీ ఫ్యాన్స్ మ‌ధ్య దుమారం రేగుతున్న‌ సమయ ఇది.

ఇలాంటి టైమ్ లో అల్లు అరవింగ్ ఇలాంటి విష‌యాల గురించి ప్ర‌స్తావ‌న లేకుండా ఉండేలా చూసుకొంటే బాగుండేది. కానీ అల్లు అర‌వింద్ అలా చేయ‌లేక‌పోయారు.

, , ,
You may also like
Latest Posts from