మొత్తానికి త్రివిక్ర‌మ్, అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా వ‌చ్చింది. అయితే హారిక హాసిని సంస్థ కేవ‌లం ఓ పోస్ట‌ర్ తో స‌రిపెట్టేసి షాక్ ఇచ్చింది. పోస్ట‌ర్ పై బ‌న్నీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు మిన‌హాయిస్తే ప్ర‌త్యేకంగా చెప్పుకొనేలా ఏం లేదు. నామ్ కే వాస్తే.. అన్న‌ట్టు ఓ పోస్టర్ వ‌దిలారంతే.

త్రివిక్రమ్ తో ..అల్లు అర్జున్ మైథలాజి సినిమా చేస్తున్నాడు అనడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా మొదలవ్వడానికి ఇంకా సమయం పట్టనుంది.

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా అట్లీ దర్శకత్వంలో అనౌన్స్ చేసారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా అనౌన్స్ చేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు. పాన్ వరల్డ్ లెవల్లో కమర్షియల్ సినిమా తీయబోతున్నట్టు తెలుస్తుంది.

అదే సమయంలో నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ త్రివిక్రమ్ తో సినిమా ఉన్నట్టు అధికారికంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దాంతో అట్లీ తో స‌మాంత‌రంగా త్రివిక్ర‌మ్ సినిమా కూడా చేస్తాడా, లేదంటే.. కాస్త గ్యాప్ తీసుకొంటాడా? అనే చ‌ర్చ ఇప్పుడు మ‌ళ్లీ మొద‌లైంది.

ఏదైమైనా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా ఉంది కానీ అట్లీ సినిమా అయ్యాక ఆ సినిమా మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. మైథలాజి బ్యాక్ డ్రాప్ లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కథతో ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ టాక్.

, ,
You may also like
Latest Posts from