‘పుష్ప2’ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం చేస్తూ వచ్చారు. 8 వారాల తర్వాత ‘పుష్ప 2’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికే పుష్ప 2 కమింగ్ సూన్ అంటూ పెట్టారు. జనవరి 30వ తారీకు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా స్ట్రీమింగ్ మొదలు కాబోతుంది. ఆ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోనే పేర్కొన్నారు. అయితే ‘పుష్ప2’ ముందు పెద్ద ఛాలెంజే ఉంది.
దాదాపు రూ.1700 కోట్లతో కొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రికార్డుల్ని బ్రేక్ చేస్తుందా లేదా అనే డిస్కషన్ మొదలైంది. అదే పెద్ద ఛాలెంజ్ అంటోంది ట్రేడ్ .
ఈనెల 30 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో పుష్ప 2 ఓటీటీ వెర్షన్ చూడొచ్చు. థియేటర్లో 3 గంటల 20 నిమిషాల సినిమా ఇది.
ఇప్పుడు మరో 20 నిమిషాలు జోడించి, 3 గంటల 40 నిమిషాలుగా విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ పుష్ప 2 ను మాగ్జిమం చూసేసారు. మరోసారి ఎంతమంది ఓటిటిలో చూస్తారనేది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న తలెత్తటానికి కారణం.. 20 నిమిషాల రీలోడెడ్ వెర్షన్‌ని థియేటర్లలో విడుదల చేసినా.. స్పందన అంతంత మాత్రంగానే రావటం.
అయితే ఓటీటీలో ఎన్ని సార్లు చూసినా ప్రత్యేకంగా ఏమీ వసూలు చేయరు కాబట్టి మంచి రెస్పాన్స్ వస్తుందని అభిమానులు అంటున్నారు. థియేటర్లో చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ చూసే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు.
సాధారణంగా బాక్సాఫీసు దగ్గర హిట్టయిన పెద్ద హీరోల సినిమాలకు ఓటీటీలోనూ మంచి ఆదరణ ఉంటుంది. పుష్ప2 కి మరింత ఉంటుంది. దానికి అదనంగా.. కొత్త సీన్స్ జోడించారు. దాంతో.. ఈ క్రేజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.