పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకో గుడ్‌న్యూస్‌. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా ఈ నెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

బెనిఫిట్‌ షో కి ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అంతే కాదు, కొన్ని రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు కూడా క్లారిటీ ఇచ్చింది. బుధవారం విడుదలైన జీవో ప్రకారం, ప్టెంబర్‌ 25న రాత్రి 1 గంట కి జరగనున్న బెనిఫిట్‌ షో టికెట్‌ ధర ₹1000 (జీఎస్టీతో కలిపి) గా ఫిక్స్‌ చేశారు.

సినిమా రిలీజ్‌ డే నుంచి అక్టోబర్‌ 4 వరకు:

సింగిల్‌ స్క్రీన్స్‌లో అదనంగా ₹125
మల్టీప్లెక్స్‌లలో అదనంగా ₹150 వసూలు చేసుకునే ఛాన్స్‌.

DVV ఎంటర్‌టైనర్స్‌ ఈ అనుమతులు ఇవ్వటంతో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌లకు సోషల్‌ మీడియాలో స్పెషల్‌ థాంక్స్‌ చెప్పింది.

సుజీత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో పవన్‌ కొత్త లుక్‌తో కనిపించబోతున్నారు. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ యాక్టర్‌ ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. తమన్‌ సంగీతం ఈ సారి భిన్నంగా ఉండబోతోంది. జపాన్‌ కోటో వాయిద్యంతో చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, లండన్‌లో 117 మంది సంగీతకారులతో వర్క్‌ అన్నది అదనపు హైలైట్‌.

, , , , , ,
You may also like
Latest Posts from