ఇప్పటికే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న మలయాళ నటుడు బసిల్ జోసెఫ్ మరో వైవిధ్యభరిత చిత్రంతో ఓటిటీలోకి ఎంటర్ అవుతున్నారు. Minnal Muraliతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న బసిల్, తాజాగా మరణ మాస్ అనే వినూత్న కథా నేపథ్యం గల చిత్రంలో హీరోగా అలరించబోతున్నారు. ఇప్పటికే థియేటర్లలో హిట్‌టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, మే 15 నుంచి Sony Liv ఓటిటీలో మలయాళంతో పాటు తెలుగు సహా ఇతర భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ ఏడాది ప్రవింకూడు షప్పు, పొన్‌మ్యాన్ లాంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన బసిల్ జోసెఫ్ – మరణ మాస్ ద్వారా మరోసారి తన వైవిధ్యాన్ని నిరూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నిర్మించినట్లు పేర్కొనాలి.

కథలోకి వస్తే…

కేరళలోని ఓ మారుమూల గ్రామాన్ని ఓ సీరియల్ కిల్లర్ గజగజ వణికిస్తున్నాడు. ‘బనానా కిల్లర్’గా పిలవబడే ఈ హంతకుడు – వృద్ధులను చంపి వారి నోట్లో అరటిపండ్లు పెడుతూ విపరీతంగా పోలీసులకు మిగిలిపోతున్నాడు. ఇలాంటి సమయంలో లూక్ అనే యువకుడి ప్రేమ విఫలమవుతుంది. ఒక రోజు అతని మాజీ ప్రేయసి – ఓ బస్సులో ఒక ముసలివాడిపై పెప్పర్ స్ప్రే వేసి, అనుకోకుండా అతన్ని చంపేస్తుంది. అదే బస్సులో బనానా కిల్లర్ కూడా ఉన్నాడు. ఆ మృతదేహాన్ని చూసిన డ్రైవర్, కండక్టర్‌ – అతనిని తమ తాతగా భావిస్తారు.

ఈ కథ ఎక్కడికెక్కడికో తిరుగుతూ, అసలు హంతకుడు ఎవరు? ముసలివాడు ఎలా చనిపోయాడు? అనే సస్పెన్స్‌తో సాగుతుంది. శివప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మర్డర్ మిస్టరీతో పాటు హ్యూమర్, ఎమోషన్‌లతో నడుస్తుంది.

కొత్త కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి ఛాయిస్!

ఇటీవల ఓటిటీల్లో ఎక్కువగా రొమాన్స్, క్రైమ్ డ్రామాలే వచ్చేస్తున్న నేపథ్యంలో మరణ మాస్ లాంటి డార్క్ హ్యూమర్ మూవీ ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. బసిల్ జోసెఫ్ అభిమానులు తప్పక చూడవలసిన సినిమా ఇది.

మే 15 నుంచి Sony Livలో స్ట్రీమింగ్‌ కాబోతున్న ఈ చిత్రాన్ని తప్పక లిస్ట్ లో చేర్చుకోండి!

, , ,
You may also like
Latest Posts from