ఎన్టీఆర్ నటిస్తున్న హిందీ చిత్రం ‘వార్ -2’ (War -2). హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో తారక్ నార్త్ ఇండియాలోనూ తన సత్తాను చాటే ప్రయత్నం చేస్తున్నాడు. ఆగస్ట్ 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ కు మంచి డిమాండ్ ఉంది.
ఎన్టీఆర్ తో అనుబంధం దృష్ట్యా. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ రైట్స్ తీసుకున్నారని అందరూ అనుకున్నారు. అయితే అదేం లేదని నాగవంశీ వివరణ ఇచ్చారు. అయితే ఎక్కువ రేట్ ని నిర్మాణ సంస్ద కోట్ చేయబట్టే ఈ రైట్స్ తీసుకోలేదని వినిపిస్తోంది. ఇంతకీ ఎంత చెప్తున్నారు. ఆ మేటర్ ఏమిటి
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్ద యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ‘వార్ 2’ విషయంలో మాత్రం సౌత్‌లో కూడా మంచి బజ్ ఉంది. కారణం ‘ఎన్టీఆర్’.
ఈ సినిమాలో తారక్ పాత్ర హృతిక్ రోషన్ పాత్రకు ధీటుగా ఉంటుందని, ఆయనపై ప్రత్యేకంగా పాటలు, డ్యాన్సులు కూడా ఉంటాయని, భారీ పోరాట సన్నివేశాలను కూడా తారక్‌పై తీశారని, ఇందులో తారక్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని.. ఇలా రకరకాల వార్తలు మీడియా సర్కిల్స్‌లో వినిపించడంతో రెండు తెలుగు రాష్ర్టాల్లో ‘వార్ 2’పై అంచనాలు పెరిగాయి.
ఈ నేపధ్యంలో ఈ సినిమా తెలుగు హక్కుల కోసం ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్న ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు.
‘వార్ 2’ తెలుగు హక్కులు 120కోట్ల మేరకు పలికే అవకాశం ఉందని సమాచారం. కానీ అంత రేటు కిట్టుబాటు అవుతుందా ట్రేడ్ లో పెద్ద డౌటానుమానం. ఎందుకంటే దేవర సినిమాను 120 కోట్ల మేరకు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చేసారు. కొన్ని చోట్ల జిఎస్టీతో, మరి కొన్ని చోట్ల కాస్త అటు ఇటుగా రిటర్న్స్ వచ్చాయి. స్ట్రయిట్ తెలుగు సినిమాకే ఆ పరిస్దితి అయితే వార్ 2 హిందీ డబ్బింగ్ కదా అంత సీన్ ఉంటుందా అనేది సగటు సినీ అభిమాని ప్రశ్న.