టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో పెద్ద విజయమే దక్కింది. తన అనుమతి లేకుండా వ్యాపార ప్రయోజనాల కోసం తన పేరు, ఫోటోలు, బిరుదులు వాడకూడదని కోర్టు స్పష్టం చేసింది.

జడ్జి ఎస్. శశిధర్ రెడ్డి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం — ఇకపై ఏ ఆన్‌లైన్ కంపెనీ, యూట్యూబ్ ఛానల్ లేదా డిజిటల్ మీడియా సంస్థ అయినా “చిరు”, “మెగాస్టార్” వంటి పేర్లు, ఆయన ఫోటోలు, వాయిస్, లేదా ఏదైనా రూపం ద్వారా ప్రకటనలు చేయకూడదు.

చిరంజీవి తన పిటిషన్‌లో పేర్కొన్నట్టు — “నా అనుమతి లేకుండా నా పేరును వాడుతూ లాభాలు పొందుతున్నారు. ఇది నా గౌరవానికీ, ఆర్థిక హక్కులకీ భంగం” అని న్యాయస్థానానికి తెలిపారు.

కోర్టు దీనిపై స్పందిస్తూ — “ఈ అనధికార వాడకం వల్ల చిరంజీవి ప్రతిష్ఠకు పూడ్చలేని నష్టం కలిగే అవకాశం ఉంది” అని అభిప్రాయపడింది. వెంటనే తాత్కాలిక నిషేధం జారీ చేసింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే — ఇటీవలి కాలంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, నాగార్జున వంటి అగ్రతారలు కూడా తమ వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) రక్షించుకునేందుకు ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు.

, , , ,
You may also like
Latest Posts from