స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం “శుభం”. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో కామెడీతో పాటు హారర్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. శోభనం గదిలో భార్యాభర్తల మధ్య సరదా సంభాషణతో టీజర్ స్టార్ట్ అవుతుంది.

దీంతో హీరో హర్షిత్ రెడ్డి తన భార్య శ్రీయ కొంతంతో కాన్వెర్షేషన్ లోల్ తనకి చాలా ధైర్యం, గాంభీర్యం ఎక్కువని చెబుతుంటాడు. కానీ తన భార్య టీవీ సీరియల్ చూస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. దీంతో ఫస్ట్ నైట్ రోజే వింత అనుభవం ఎదురవుతుంది. ఆ తర్వాత హర్షిత్ రెడ్డి తన ఫ్రెండ్స్ ని కలుస్తాడు. అప్పుడు పురుషుల్లో రెండు రకాలు.. మొదటిది సాధారణ పురుషుడు, ఆల్ఫా పురుషుడు.. అంటూ చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి.

మొత్తానికి టీవీ సీరియల్స్ కి ఎడిక్ట్ అయిన భార్యతో భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమా చివరిలో పడే ఎండ్ కార్డు టైటిల్ ని ఏకంగా సినిమా టైటిల్ గా పెట్టి డిఫరెంట్ గా ట్రై చేశారు.

ఈ సినిమాలో నూతన నటీనటులు హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ కాగా బాగానే ఆకట్టుకుంటోంది.

,
You may also like
Latest Posts from