విక్కీ కౌశల్‌, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో నటించిన బాలీవుడ్‌ మూవీ ‘ఛావా’ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. లాంగ్‌ రన్‌లో ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేయడం ఖాయమనిపిస్తోంది. అంతేకాదు రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోనూ ఛావా సందడి మొదలు కాబోతుంది. తెలుగులో ఛావా సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా రిలీజ్ అడ్డంకి వచ్చింది. అదేంటో చూద్దాం.

ఛావా తెలుగు రిలీజ్‌కి సంబంధించిన హడావుడి ఒకవైపు కొనసాగుతూ ఉంటే మరో వైపు సినిమాను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఏపీలోని ముస్లీం ఫెడరేషన్‌ నాయకులు ఇటీవల నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఛావా సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.

ఛావా సినిమా కారణంగా ఉత్తర భారతంలో చాలా చోట్ల గొడవలు జరిగాయని, ఏపీలోనూ అలాంటి మత ఘర్షణలకు అవకాశం ఉంది కనుక సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ ఏపీ ముస్లీం ఫెడరేషన్‌ అధ్యక్షుడు జియా ఉల్‌ హకీ డిమాండ్‌ చేస్తున్నాడు.

ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలంటే ఛావా సినిమా విడుదలను అడ్డుకోవాలని ఆయన అంటున్నాడు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయింది. డీసెంట్‌ బుకింగ్‌ నమోదు అవుతున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది

సినిమాను గీతా ఆర్ట్స్ వారు భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్‌లలో ఛావా తెలుగు వర్షన్‌ను రిలీజ్‌ చేయబోతున్నారు.

, ,
You may also like
Latest Posts from