కళ్యాణ్ రామ్ తో చేసిన “బింబిసార”తో కాలాన్ని వశం చేసుకున్న వశిష్ఠ… ఈసారి “విశ్వంభర”తో విశ్వాన్ని ఆణిముత్యంలా తీర్చిదిద్దుతున్నాడు. చిరంజీవి మొదట అనుకున్న సంక్రాంతి ని కాదు, ఇప్పుడు మరో సీజన్ స్కిప్ చేస్తూ మూవీ మూడ్ ను మాంత్రికంగా మిస్టీరియస్ గా మార్చేస్తున్నారు. దాంతో రిలీజ్ డేట్ పై పెద్ద రచ్చ మొదలైంది.

ఒరిజినల్ ప్లాన్ – సంక్రాంతి. అదే చిరంజీవికి కలిసొచ్చే శుభసమయం. “ఇంద్ర”, “శంకర్ దాదా”, “వాల్తేరు వీరయ్య”… అన్నీ సంక్రాంతి హిట్లు. అయితే ఈసారి అది సాధ్యపడలేదు. VFX మాయాజాలమే ఆలస్యానికి కారణం. వశిష్ఠ విజువల్ వరల్డ్ ఒక ఊహల ఊసుపోస్తే, దానికి జీవం పోసే బాధ్యత VFX టీమ్‌దే.

అలాగని జల్దీ గా దేనికి పడితే దానికి ఓకే అనేస్తే, జగదేకవీరుడు గుర్తుండదు. అలాగే ఆలస్యం చేసినా జనం మర్చిపోతారు. ప్రతి వాయిదా వెనుక అంచనాలు పెరుగుతున్నాయి. మెగా ఫ్యాన్స్ గూగుల్‌లో “Viswambhara Release Date” టైప్ చేసి విసుగు పడిపోయారు. ఇప్పటికైనా ఓ డేట్ ఫిక్స్ కావాలంటున్నారు.

అయితే తాజా బజ్ ప్రకారం… సెప్టెంబర్ 25 టార్గెట్! అధికారిక ప్రకటన లేదు గానీ – సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది.
ఇది నిజమే అయితే… దీపావళికి ముందే చిరంజీవి థియేటర్స్ లో మంత్రం మ్యాజిక్ పనిచేస్తూంటాయి!

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత‌ ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ఇక గ‌తేడాది ద‌స‌రా కానుక‌గా ‘విశ్వంభ‌ర’ టీజ‌ర్‌ విడుద‌ల కాగా… మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.

, , ,
You may also like
Latest Posts from