వార్ 2, కూలి …రెండు చిత్రాలు భారీ అంచనాలతో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. రజనీకాంత్, హృతిక్ – ఎన్టీఆర్ కాంబినేషన్లు ప్రేక్షకుల్లో పెద్ద ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశాయి. రిలీజ్‌కు ముందే బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్లతో హాట్ టాపిక్ అయిన ఈ సినిమాలు, మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు రాబట్టాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ రెండు సినిమాలు ఆ అంచనాలను అందుకోవడంలో రెండూ విఫలం అయ్యాయి. అయితే వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. టాక్‌తో సంబంధం లేకుండా ఈ మూడు రోజులు భారీగానే వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేసింది అదే జరుగుతోంది. అయితే మరీ ముఖ్యంగా కూలీ vs వార్ 2: ఇండిపెండెన్స్ డే బాక్సాఫీస్ యుద్ధం – ఎవరు గెలుస్తారు? అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇండిపెండెన్స్ డే వీక్‌లో థియేటర్లలో ఫుల్ జోష్!
రివ్యూలు మిక్స్డ్ గానే ఉన్నా. ఇండిపెండెన్స్ డే సెలవు కారణంగా రెండు సినిమాలు కూడా ఫుల్ స్ట్రాంగ్‌గా రన్ అయ్యాయి. మార్నింగ్ షో నుండి నైట్ షో వరకు థియేటర్లు ప్యాక్‌గా ఉన్నాయి. వీకెండ్‌కి రెండు సినిమాలు కూడా డీసెంట్ కలెక్షన్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, మహావతార్ నరసింహ & సయ్యారా కూడా లిమిటెడ్ స్క్రీన్స్‌లో హాలిడే బూస్ట్‌కి బాగానే లాభపడ్డాయి.
మొత్తం మీద, ఈ శుక్రవారం థియేటర్లకి పక్కా ఫెస్టివల్ మూడ్ వచ్చింది.