దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించిన విజనరీ, శాస్త్రవేత్త, రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథ వెండితెరపైకి రాబోతుంది! ఈ బహుముఖ ప్రాజెక్ట్‌లో కలాంగా నటించబోతున్నాడు సౌత్ స్టార్, న్యాచురల్ పెర్ఫార్మర్ ధనుష్.
‘కలాం’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ బయోపిక్‌కు మేకింగ్‌తోనే కాక, మానవీయతతో కూడిన కథనానికి కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా రిలీజ్ చేయడం విశేషం. పోస్టర్‌లో కలాం సిల్హౌట్ వెనుక నుంచి లాంచ్ అవుతున్న మిస్సైల్… ఆయన జీవితానికి నిజమైన సారాంశాన్ని చెబుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించబోతున్నది ‘తానాజీ’, ‘ఆదిపురుష్’ వంటి విజువల్ గ్రాండియర్ మూవీస్‌ను డైరెక్ట్ చేసిన ఓం రౌత్. ఇక ఈ చిత్రాన్ని ఇండియా టాప్ ప్రొడ్యూసర్లు – అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ అగర్వాల్ సమర్పణలో రూపొందుతున్న ఈ బయోపిక్‌ను ‘ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేయనున్నారు.
ఈ చిత్రంలో కలాం గారి పాత్ర కోసం ధనుష్ ఫిజికల్ & మెంటల్ గా తనను తాను పూర్తిగా మార్చుకుంటున్నాడట. వేషధారణ, వాయిస్ మోడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ న్యువాన్స్ – అన్నింటిపైనా అతను సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నాడని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటుల వివరాలు, షూటింగ్ షెడ్యూల్స్ త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ – ‘కలాం’ బయోపిక్… భారత సినిమా చరిత్రలో ఒక ప్రేరణాత్మక మైలు రాయిగా నిలవడం ఖాయం!