ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dilraju) మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. మారుతున్న సాంకేతికతను సినీ రంగానికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏఐ పవర్‌ మీడియా కంపెనీని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మే 4న వెల్లడించనున్నట్లు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు.

ఇప్పటివరకు నిర్మాతగా అనేక సూపర్ హిట్ సినిమాలు అందించిన దిల్ రాజు.. మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ డిమాండ్ బాగా పెరిగిపోయింది.

నిర్మాత దిల్ రాజు కూడా AI వెంచర్ లోకి అడుగుపెట్టారు. క్వాంటం AI గ్లోబల్‌తో కలిసి తెలుగు సినిమాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తీసుకువస్తున్నారు. మే 4న AI- ఆధారిత వీడియో కంపెనీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో వీడియో బైట్  రిలీజ్ చేశారు.

You may also like
Latest Posts from