తెలుగులో ఉన్న మాస్ కమర్షియల్ డైరక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. కెరీర్ ప్రారంభంలోనే పవన్ తో చేసిన గబ్బర్ సింగ్ తో తన తడాఖా చూపించాడు. అయితే ఆ తరవాత ఆ స్థాయి సక్సెస్ మళ్లీ రాలేదు. రీసెంట్ గా రవితేజతో మిస్టర్ బచ్చన్ చేశాడు. కానీ అది డిజాస్టర్ అయ్యింది. బాలకృష్ణతో ఓ సినిమా చేస్తానని ఎప్పటి నుంచో చెబుతున్నాడు హరీష్. అది ఎట్టకేలకు పట్టాలు ఎక్కబోతోందని తెలుస్తోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ నటుడుగానూ తనలోని మరో యాంగిల్ ని మన ముందు ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమిటా సినిమా, ఎవరా హీరో
సుహాస్ హీరోగా రూపొందుతున్న సినిమాలలో ‘ఓ భామ అయ్యో రామ’ (O Bhama Ayyo Rama Movie) ఒకటి. రామ్ గోధల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను వి ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్ గడగోని, ప్రదీప్ తల్లపురెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.
ఈ సినిమాలో హరీష్ శంకర్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. బుధవారం నుంచే హరీష్ శంకర్ జాయిన్ అయ్యారు. ఆయన మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించారు దర్శకుడు రామ్ గోధల. హరీష్ శంకర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సినిమాలో ఆయన ఎంతసేపు కనిపిస్తారు? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి.
ప్రస్తుతానికి అయితే ఆయన నటుడిగా మారారు అనేది కన్ఫర్మ్. ఇంతకు ముందు ‘నిప్పు’, ‘నేనింతే’ సినిమాలలో హరీష్ శంకర్ అతిథి పాత్రలు చేశారు. ఇప్పుడు కాస్త వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు