మాచో స్టార్ గోపీచంద్‌కి కచ్చితంగా సాలిడ్ హిట్ కావాలి. అతను వరుస ఫ్లాఫ్ లతో దూసుకుపోతున్నాడు. అతని చివరి చిత్రం విశ్వం బిలో యావరేజ్ సినిమాగా నమోదు అయ్యింది. కొంతకాలం గ్యాప్ తర్వాత, గోపీచంద్ కొత్త ప్రాజెక్ట్‌పై సంతకం చేసి, ఈ రోజు అఫీషియల్ గా ప్రకటించారు.
ఘాజీ, అంతరిక్షం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ కొత్త సినిమా చేయనున్నారు, ఇది అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ఇంట్రస్టింగ్ కాంబో లో రూపొందే ప్రాజెక్టుని నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు . రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలను మేకర్స్ ప్రకటిస్తారు.
భారతీయ చరిత్రలో కీలకమైన, మరచిపోలేని సంఘటనలతో దీన్ని రూపొందిస్తున్నారు. గోపీచంద్ ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని పాత్రలో కనిపించనున్నట్లు టీమ్ పేర్కొంది.
7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఇండస్ట్రీలోని గొప్ప సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు.
త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. ఇందులో భాగం కానున్న నటీనటులు, టెక్నికల్ టీమ్‌ను ప్రకటించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.