పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది! జూలై 24, 2025న విడుదల కానున్న పాన్-ఇండియన్ యాక్షన్ పీరియడ్ ఎపిక్ ‘హరిహర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. గత కొద్ది నెలలుగా ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూసిన సంగతి తెలిసిందే.

దాంతో ఈ ట్రైలర్‌తోనే ఒక్కసారిగా ట్రేడ్ వర్గాల్లో హైపు తారస్థాయికి చేరింది. విడుదలైన తొలి గంటలోనే మిలియన్ల వ్యూస్, ట్రెండింగ్‌లో అగ్రస్థానం దక్కించుకోవడం పవన్ మేనియా ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది.

ట్రైలర్‌లో పవన్ వాయిస్ ఓవర్‌తో దద్దరిల్లిన మూడ్:

“హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం…
ఈ దేశ శ్రమ బాద్‌షా పాదాల కింద నలిగిపోతున్న సమయం…
ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం…”

ఈ డైలాగ్‌లతో ట్రైలర్ మొదలవ్వగానే, నరాల్లో ఉత్తేజం పుట్టిస్తుంది. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబు కాలం నేపథ్యంగా సాగుతున్న ఈ కథలో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీర మల్లు’ అనే గంభీరమైన యోధుడిగా దర్శనమిస్తాడు. పవన్ చరిష్మాకు చరిత్ర తలవంచేలా చూపించిన విజువల్స్ ఫ్యాన్స్‌ని ఫిదా చేశాయి.

బాబీ డియోల్, నాజర్, నార్గిస్ ఫఖ్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, నోరా ఫతేహి లాంటి నటులు ట్రైలర్‌లో కనిపించి సినిమా స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్లారు. జ్యోతి కృష్ణ, క్రిష్ జగర్లమూడి ఇద్దరు కలసి దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం ఈ ప్రాజెక్ట్‌కి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం ట్రైలర్‌లోనే గూస్‌బంప్స్‌ ఇస్తోంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, తోట తరణి ప్రొడక్షన్ డిజైన్‌ వన్ వర్డ్‌లో “గ్రాండ్”.

ఇక ఈ సినిమా ట్రైలర్‌తో పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ ట్రేడర్లు కూడా ఓ “హరిహర హిట్” కోసం కూర్చొని ఉన్నారు. ట్రైలర్ విడుదలవడంతో డిజిటల్, థియేట్రికల్, ఓవర్సీస్ రైట్స్ రేంజ్ ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

‘హరిహర వీర మల్లు’ ట్రైలర్ ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది – ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోని భారీ చిత్రాల్లో ఒకటి మాత్రమే కాదు, పాన్-ఇండియా వేదికపై అతడి బలాన్ని నిలబెట్టే యుద్ధం! ట్రైలర్ లో పవన్ చెప్పినట్టు – ఒక వీరుడు కోసం ప్రకృతి ఎదురు చూస్తోంది… ఇప్పుడు ఆ సమయం వచ్చింది.

, , , , ,
You may also like
Latest Posts from