నాని నిర్మాతగా తెరకెక్కించిన కోర్ట్ పై మంచి బజ్ వుంది. వాల్ పోస్టర్ సినిమా నుంచి నాని తీసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ తో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకొన్నాయి. కోర్ట్ సినిమాపై కూడా నాని నమ్మకంతో ఉన్నాడు. అదెంతంటే.. ‘ఈ సినిమా నచ్చకపోతే.. నా రాబోయే హిట్ 3 చూడొద్దు’ అనేంతగా ప్రమోషన్లు కూడా భారీగానే చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈ ప్రీమియర్ షోలకు భారీ డిమాండ్ వచ్చింది. దాంతో మరిన్ని షోలు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ కు ముందే సూపర్ హిట్ అంటున్నారు.
ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ప్రధాన పాత్ర పోషించిన మూవీ ఇది. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఈ సినిమాకి 2 రోజుల ముందు నుండే ప్రీమియర్స్ వేస్తున్నాడు.
మార్చి 12న ఈ సినిమాని మీడియాకి చూపించబోతున్నారు. ఆ తర్వాతి రోజు అంటే మార్చి 13న పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నాడు నాని. రిలీజ్ ముందే ప్రిమియర్స్ వేస్తున్నారు అంటే ఆడియన్స్ లో ఏదో తెలియని క్యూరియాసిటీ ఉంటుంది. దానికి తగ్గట్టు కథ కథనాలు ఉంటే.. రిలీజ్ రోజున ఓపెనింగ్స్ అదిరిపోతాయనేది నిజం.
సినిమా 2 గంటల 29 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది.
టీనేజ్ కి వచ్చిన ఓ అమ్మాయి, అబ్బాయి.. ఒకరినొకరు ప్రేమించుకోవడం.. అది నచ్చని అమ్మాయి ఇంటి వాళ్ళు వీళ్ళని విడదీసే ప్రాసెస్‌లో ఆ 19 ఏళ్ళ కుర్రాడిపై ‘ఫోక్సో’ వంటి భయంకరమైన సెక్షన్లతో కేసులు పెట్టి ఇరికించడం జరుగుతుందట.
బీద కుటుంబంలో పుట్టిన ఆ కుర్రాడికి న్యాయం చేయడానికి ఏ లాయర్ ముందుకు రారు. వచ్చినా.. కోర్టులో వాదించినా ఆ కుర్రాడు నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి సాధ్యపడని పరిస్థితి. ఇలాంటి టైంలో ఓ కుర్ర లాయర్ (ప్రియదర్శి) ఆ కేసును టేకప్ చేయడం. ఆ తర్వాత అతనికి ఎదురైన పరిస్థితులు.. మిగతా సినిమా .