రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవటం మెగా ఫ్యాన్స్ కు పెద్ద దెబ్బగా మారింది. ఈ సినిమా బాక్సాఫీస్ పనితీరు తర్వాత, మెగా అభిమానులు ఇప్పుడు రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్టు పై ఎక్కువ ఆసక్తితో కలిగి ఉన్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ ని అధిగమించే ప్రయత్నంలో, రామ్ చరణ్ పుట్టినరోజు అయిన మార్చి 27న ఈ కొత్త చిత్రం టీజర్‌ను విడుదల చేయాలని అభిమానులు సోషల్ మీడియాలో ఒత్తిడి చేస్తున్నారు. అభిమానులు తమ అభిమాన హీరోని పెద్ద సక్సెస్ తో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్దితుల్లోనూ ఈ సంవత్సరం సినిమాను విడుదల చేయాలని వారు పిలుపునిస్తున్నారు.

బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌సీ 16’(వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం షూటింగ్‌లో రామ్ చరణ్ కంటిన్యూగా పాల్గొంటున్నారు.

తొలి చిత్రం ‘ఉప్పెన’ తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న బుచ్చిబాబు సానా ద్వితీయ చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేసే అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు ‘ఆర్‌సీ 16’ ని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్‌ హీరోల్లో ఒకరైన శివ రాజ్‌కుమార్‌ పవర్‌ఫుల్‌ రోల్‌ పోషించనున్నారు. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ఈ నెల 22 నుంచి కర్నాటక రాష్ట్రంలోని మైసూర్‌లో మొదలెట్టారు.

రామ్‌ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించారు బుచ్చిబాబు. అక్కడ నాన్‌స్టాప్‌గా 15 రోజుల పాటు షూటింగ్‌ జరిపారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

, ,
You may also like
Latest Posts from