రెమ్యునేషన్స్ పోటీ పడి మరీ నిర్మాతలు ఇస్తున్నారు. టెక్నీషియన్స్ , హీరోలు డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు. ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చామని చెప్పుకోవటం కూడా నిర్మాతలుకు గర్వకారణంగా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’-2 కు సైతం అదే విధంగా అందరికీ భారీ రెమ్యునేషన్స్ ఇచ్చారని తమిళ నాట ప్రచారం జరుగుతోంది. ఇంతకీ రజనీ ఈ సినిమా నిమిత్తం ఎంత తీసుకున్నారో చూద్దాం.
రజనీ నటించిన జైలర్ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, నటన పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
తమిళనాడుతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాక అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా నిమిత్తం రజనీకు 100 కోట్లు రెమ్యనరేషన్ గా ముట్టిందని వినికిడి.
ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్‌గా జైలర్ 2 సినిమా కూడా వస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జైలర్ 2 టీజర్ విడుదలయింది. ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ టీజర్‌కి జనాల నుంచి విశేష స్పందన వస్తోంది.
ఈ టీజర్‌లో మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కనిపించడం విశేషం. ఈ సినిమా నిమిత్తం రజనీకు 200 కోట్లు ఇస్తారని తమిళనాట ప్రచారం జరుగుతోంది. అయితే క్యాష్ రూపంలో ఈ రెమ్యునరేషన్స్ ఇవ్వటం లేదని రైట్స్ రూపంలో ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ జైలర్ 2 చిత్రంలో మరింత వైలెన్స్ ఉండనుందని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. జైలర్ 2లో రజనీకాంత్‌తో పాటు జైలర్ 1లో కనిపించిన ప్రధాన తారాగణం కూడా కొనసాగుతుండటంతో ప్రేక్షకులలో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టీజర్ సోషల్ మీడియాలో విడుదలైన కొద్దిసేపటికే విపరీతమైన వ్యూస్‌ను సొంతం చేసుకోవడంతో ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధిస్తుందో వేచి చూడాలి.