సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరక్టర్ రాజమౌళి కాంబినేషన్‍లో ప్యాన్ ఇండియా మూవీ రూపొందనుందన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై ఎక్సపెక్టేషన్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మహేశ్ బాబు పాస్‍పోర్ట్ సీజ్ చేసేశానంటూ రాజమౌళి సరదాగా ఇటీవల చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసేసింది. షూటింగ్ మొదలైందనేలా ఆయన హింట్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రాజెక్ట్ పేరు ఎస్ఎస్ఎంబీ29గా పిలుస్తున్నారు. ఈ గ్లోబల్ రేంజ్ మూవీలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు కనపడనున్నారు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో ఓ బాలీవుడ్ స్టార్ ఫిక్స్ అయ్యారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.
ఈ చిత్రంలో ధూమ్ విలన్ జాన్ అబ్రహం వస్తున్నట్టు సమాచారం. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ఇటీవలే చర్చలు జరిగినట్టు తెలిసింది. అఫీషియల్ న్యూస్ వచ్చేదాకా ఆగాలి.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కూడా కీలకపాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఆమె హైదరాబాద్‍కు కూడా వచ్చారు. ఈ మూవీ కోసమే ఆమె ఇక్కడి వచ్చారని, గ్లోబల్ రేంజ్‍లో గుర్తింపు ఉన్న ప్రియాంక ఈ చిత్రం నటిస్తున్నారనే సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై మూవీ టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
బాలీవుడ్ మీడియా ప్రకారం జాన్ అబ్రహం, ప్రియాంకా చోప్రా ఒక జంటగా కనిపిస్తారు. అడవి నేపథ్యంలో ఇండియానా జోన్స్ తరహాలో ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నారు రాజమౌళి.