దేవర చిత్రం జపాన్‌లో విడుదల అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్‌లో సందడి చేస్తున్నారు ఎన్టీఆర్. అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అలాగే అక్కడి అభిమానులతోనూ ముచ్చటించారు.
ఎన్టీఆర్‌ని చూసేందుకు జపాన్ ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. ఆటోగ్రాఫ్ అడిగి తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక జపాన్ లేడీ అభిమాని తారక్‌ని సర్‌ప్రైజ్ చేసింది. ఏం సర్పైజ్ చేసిందో క్రింద వీడియో లో చూడండి మరి.
ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్లు సాధించింది. దీంతో ఈ సినిమాను జపాన్‌లో మార్చి 28న విడుదల చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది.