అభిమానుల ప్రేమ అమూల్యమైనదే కానీ, ఒక్కోసారి అది అత్యుత్సాహంగా మారి… అదే అభిమానించే హీరోకి అసౌకర్యంగా మారుతుంటుంది. ఇటీవల లండన్‌లో నిర్వహించిన ‘ఆర్ఆర్ఆర్’ లైవ్ కాన్సర్ట్ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అచ్చం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు.

రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి కలిసి స్టేజ్‌పై సందడి చేశారు. రామ్ చరణ్‌ – తారక్ మధ్య సాగిన ఆత్మీయత, ఆ క్షణాలు అభిమానుల మనసులను కదిలించాయి.

అయితే ఈ సన్నివేశాల అనంతరం, వేడుక ముగిశాక హాల్ వెలుపల అభిమానుల నుంచి వచ్చిన అసాధారణ స్పందన తారక్‌కు అసౌకర్యాన్ని తెచ్చింది. సెల్ఫీలు తీసుకునేందుకు భారీగా అభిమానులు ఎగబడడంతో ఎన్టీఆర్ కాస్త అసహనంగా కనిపించారు.

“ఒక్కొక్కరికి ఫోటో ఇస్తాను… కానీ మీరు కాస్త ఓపిక పట్టాలి. ఇలా అయితే భద్రతా సిబ్బంది మిమ్మల్ని బయటకు పంపాల్సి వస్తుంది,” అని వారిని ప్రశాంతంగా బుజ్జగించే ప్రయత్నం చేశారు తారక్.

కానీ ఆయన మాటలు వినకుండా అభిమానులు ఆందోళన కలిగించే విధంగా ప్రవర్తించడంతో, చివరకు భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఎన్టీఆర్‌ను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారక్ అభిమానుల పట్ల చూపించిన ఓర్పు, బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు అందరికీ మెచ్చుకోతగిన విషయంగా మారింది.

, , ,
You may also like
Latest Posts from