అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కేసరి చాప్టర్ 2’. గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకువచ్చింది.సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో ఒకటిగా కేసరి చాప్టర్2 సినిమా అని వార్తలు వచ్చాయి. అయితే భాక్సాపీస్ దగ్గర టాక్ కి తగిన స్దాయిలో కలెక్షన్స్ అయితే కనపడటం లేదు. అందుకు కారణం అక్షయ్ కుమార్ వరస ప్లాఫ్ లే అంటున్నారు.
అక్షయ్ కుమార్ కి నికార్సయిన కంబ్యాక్ మూవీ అనిపించే రేంజ్ లో ఉన్న ఈ సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా మెప్పిస్తుందనేది ట్రేడ్ లో ఆసక్తికరమైన విషయంగా మారింది. తన పెర్ఫార్మెన్స్ సినిమాలో మేజర్ హైలెట్ గా నిలిచాడు. తన డైలాగ్స్, సీన్స్ అన్నీ కూడా ఆడియన్స్ కదిలిస్తున్నాయంటున్నారు. అయితే థియేటర్స్ కు జనం ఆ స్దాయిలో కదిలి వెళ్లటం లేదు.
మరో ప్రక్క అక్షయ్ తన అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. సినిమా గురించి చెబుతూ మొదటి పది నిమిషాలు ఎవరూ మిస్ కావొద్దని కోరారు. ‘‘మీరు ఈ సినిమా ప్రారంభాన్ని అసలు మిస్ కావొద్దు. మొదటి 10 నిమిషాలు చాలా ముఖ్యం. థియేటర్‌కు ఆలస్యంగా రావొద్దు. మీరంతా మీ సెల్‌ఫోన్లను ఆఫ్ చేసుకోండి.
ఇందులోని ప్రతి డైలాగును తప్పకుండా వినాలని నేను అభ్యర్థిస్తున్నాను. సినిమా చూస్తున్న సమయంలో మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దీన్ని పూర్తిగా అవమానించినట్లే అవుతుంది. అందుకే ఈ చిత్రాన్ని చూసేటప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి’’అని అక్షయ్ విజ్ఞప్తి చేశారు.
‘కేసరి చాప్టర్ 2’ విషయానికొస్తే.. అక్షయ్ కుమార్ హీరోగా కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో ఇది రూపొందింది. అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనేది ట్యాగ్‌లైన్. మాధవన్, అనన్యపాండే కీలకపాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమాను దిల్లీలో ప్రదర్శించగా దిల్లీ సీఎం రేఖ గుప్తా భావోద్వేగానికి గురయ్యారు.
అలాగే ఈ చిత్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం కచ్చితంగా చూడాలని అక్షయ్‌కుమార్ అన్నారు. ఆ ప్రభుత్వంతో పాటు కింగ్ చార్లెస్ కూడా ఈ చిత్రాన్ని చూసి వారి తప్పును తెలుసుకోవాలని కోరారు. దీన్ని చూశాక వారు కచ్చితంగా క్షమాపణలు చెబుతారని అన్నారు.