తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ (TTFECA) ఇప్పుడు పర్శంటేజ్ షేరింగ్ సిస్టమ్ అమలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ఈ ఆదివారం ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణ తెలుగు ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ & కంట్రోలర్స్ అసోసియేషన్) నిర్ణయించిన పర్శంటేజ్, షేరింగ్ సిస్టమ్ వివరాలు ఇలా ఉన్నాయి:
ఎగ్జిబిటర్స్ అభ్యర్థిస్తున్న షేరింగ్ విధానం:
- నిజాం ₹30 కోట్లు పైగా గ్రాసర్స్
(హిట్ సినిమాలు):
•1వ వారం: 25% (ఎగ్జిబిటర్ షేర్)
•2వ వారం: 45%
•3వ వారం: 60%
•మిగిలిన వారాలు: 70% - ₹10 కోట్లు – ₹30 కోట్ల మధ్య గ్రాసర్స్:
•1వ వారం: 40%
•2వ వారం: 50%
•3వ వారం: 60%
•మిగిలిన వారాలు: 70% - ₹10 కోట్లలోపు గ్రాసర్స్
(చిన్న సినిమాలు):
•1వ వారం: 50%
•2వ వారం: 60%
•మిగిలిన వారాలు: 70%
⸻ముఖ్యాంశాలు:
•ఈ షేరింగ్ విధానం NETT కలెక్షన్స్ ఆధారంగా ఉంటుంది.
•ప్రస్తుత రెంటల్ లేదా ఫిక్స్‌డ్ షేర్ మోడల్‌కు బదులుగా ఇది అమలవుతుంది.
•ఈ విధానం వల్ల సినిమాలు ఎక్కువ రోజులు నడవడానికి థియేటర్లకు ఉత్సాహం లభిస్తుంది.
•ఫైనల్ నిర్ణయం ఈ ఆదివారం TTFECA సమావేశంలో తీసుకోబడే అవకాశముంది.