గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టు గురించి మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. కిల్ డైరక్టర్ తో ఆయన ఓ మైథలాజికల్ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే చివరకి ఆ డైరక్టర్ ఖండించారు. అయితే తాజాగా ఆయన ఓ తెలుగు హీరోకు కథ చెప్పినట్లు మళ్లీ వార్తలు గుప్పు మన్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు..
లాస్ట్ ఇయిర్ వచ్చిన ‘కిల్’ (Kill Moive) సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్. ఇప్పుడాయన విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఆయన ఓ లవ్ – యాక్షన్ కథను సిద్ధం చేసుకున్నారని తెలిసింది.
ఇప్పటికే దీనికి సంబంధించిన కథా చర్చలు మొదలయ్యాయని.. నిఖిల్ చెప్పిన ఆలోచన విజయ్‌కు నచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్ కరణ్ జోహార్ నిర్మాణంలో వచ్చే ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.
ఇక ‘కింగ్‌డమ్’ తర్వాత హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చేయనున్న రెండు సినిమాలపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
వాటిలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించనున్న కొత్త చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుండగా.. ఆ వెంటనే రవి కిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కనుంది (Vijay Deverakonda Latest Movie).
అయితే ఈ రెండూ ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే విజయ్ మరో ప్రాజెక్ట్ విషయమై చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది