యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తనదైన మాస్ స్టైల్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కే ర్యాంప్’ నుంచి తాజాగా విడుదలైన ‘రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్ సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్‌కి వచ్చిన రెస్పాన్స్ తర్వాత, ఈ గ్లింప్స్ సినిమాపై హైప్‌ను మరింత పెంచేసింది.
మాస్ డైలాగ్స్‌తో అదరగొట్టిన కిరణ్
‘‘చేటలు ఎల్లారుకూ నమస్కారం.. ఈసారి ఒక్కొక్కరికీ బుర్ర పాడు… జారుడే!’’ అంటూ కిరణ్ చెప్పే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలవుతుంది. మాస్ లుక్, దంచికొట్టే ఎనర్జీతో కిరణ్ స్క్రీన్‌ను షేక్ చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథలో, ‘‘కుమార్’’ అనే ఓ తెలుగోడిగా కిరణ్ చిలిపితనం, అల్లరి చూపిస్తూ యూత్‌లో మళ్లీ క్రేజ్ తెచ్చుకోనున్నారు.
డైలాగ్ హైపే కాదు, చర్చకూ కారణం
గ్లింప్స్‌లో చివర్లో వచ్చే కిరణ్ డైలాగ్ –
‘మనం ఏఎంబీ సినిమాలో మలయాళ ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం. కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉండే ఆంథెటిసిటీ మన సినిమాల్లో ఉండదు. ప్రేమ మాత్రం బాగుండాలని కోరుకుంటాం..’ “
ఈ డైలాగ్ యువతలో ఆసక్తిని రేపుతున్నప్పటికీ, కొన్ని పదాలు కొంతమందికి అసౌకర్యంగా అనిపించేలా ఉన్నాయి అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
ఆసక్తికరంగా టీమ్ సెటప్
ఈ చిత్రాన్ని రాజేశ్ దండ మరియు శివ బొమ్మక్ లు హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో జైన్స్ నాని దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వగా, యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ లాంటి టాలెంటెడ్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం అందిస్తున్న చేతన్ భరద్వాజ్ ట్యూన్స్‌తో కూడా బజ్ పెరుగుతోంది.
దీపావళికి మాస్ ఫెస్టివల్
సినిమాను అక్టోబర్ 18న, దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఫన్, ఫ్యామిలీ, ఫుల్ కామెడీ కలిపిన ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుందని గ్లింప్స్‌తో స్పష్టమైంది. సోషల్ మీడియాలో యూత్ ట్రాక్‌కు బాగా కనెక్ట్ అవుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
వరుస ప్రాజెక్టులతో కిరణ్ బిజీ
కిరణ్ ప్రస్తుతం మరో లవ్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ షూటింగ్‌లో ఉన్నారు. ఇందులో ఆయనకు జోడీగా శ్రీ గౌరీ ప్రియ నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘కే ర్యాంప్’ తర్వాత, ‘క’ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మొత్తానికి… ‘కే ర్యాంప్’ గ్లింప్స్ చూసినవాళ్లంతా ఒకే మాట చెబుతున్నారు – ఈసారి కిరణ్ కి హిట్ ఖాయం!