
శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రల్లో ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘మదరాసి’ (Madharaasi). సెప్టెంబర్ 5న (Madharasi release date) తమిళ, తెలుగు భాషల్లో విడుదల అయ్యింది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై విడుదల చేసారు.
ఇక శివకార్తికేయన్ – మురుగదాస్ – అనిరుధ్ కాంబినేషన్ అనగానే ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ టాప్ గేర్‌లోకి వెళ్లాయి. ట్రైలర్ రిలీజయ్యాక మరింత హైప్ పెరిగింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, బ్లాక్‌బస్టర్ రేంజ్ మ్యూజిక్ టచ్‌తో, ఈ సినిమా మినిమం 300–400 కోట్ల వసూళ్లు కొడుతుందనుకున్నారు.
కానీ రిలీజ్ అయిన తర్వాత గేమ్ రివర్స్ అయింది.
ప్రముఖ మీడియా సంస్దల రివ్యూలు, క్రిటిక్స్ కామెంట్స్ వలన ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఒక్కసారిగా కూలిపోయాయి. “సరిగ్గా వండని స్టోరీ – ఎక్కువ యాక్షన్ – ఇంపాక్ట్ తక్కువ” అనే ట్యాగ్ పడిపోయింది. ఫస్ట్ వీకెండ్ ఓకే కలెక్షన్స్ వచ్చినా, ఆ తర్వాత వసూళ్లు క్రమంగా పడిపోయి… 200 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన సినిమా 100 కోట్లకే ఆగిపోయింది.
ఇక ఇప్పుడు థియేటర్స్ నుంచి నేరుగా ఓటీటీ వైపు అడుగుపెడుతోంది. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
స్టోరీ పాయింట్:
నార్త్ ఇండియా నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న వెపన్స్ సిండికేట్ను అడ్డుకోవడమే ఈ కథ యొక్క కోర్ పాయింట్. ఆ సిండికేట్ హీరో – హీరోయిన్స్‌ను ఎలా టార్గెట్ చేసింది? వాళ్లు దానికి ఎలా ప్రతిఘటించారు? అనేదే సస్పెన్స్‌తో నడిచే స్టోరీ.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్ కూడా కీలకమైన పాత్రలో కనిపించాడు.
