
కేవలం రొమాన్స్ కాదు… కీలక ట్విస్టుల్లో కూడా మాళవికే? ‘ది రాజా సాబ్’ షాకింగ్ అప్‌డేట్!
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చుట్టూ హైప్ అల్రెడీ ఆకాశాన్నంటుతోంది. సంక్రాంతికి రానున్న ఈ మాస్ రొమాంటిక్ హారర్ ఎంటర్‌టైనర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇంత క్రేజ్ మధ్య, హీరోయిన్ మాళవిక మోహనన్ ఇప్పుడు చెప్పిన వివరాలు అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ రేపుతున్నాయి.
చెన్నైలో జరిగిన ABP Southern Rising Summit 2025లో మాళవిక, సినిమాలో తాను చేసిన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్లు షేర్ చేశారు.
“సూపర్‌స్టార్ సినిమాల్లో హీరోయిన్‌కు స్కోప్ ఉండదనుకున్నా… ఇక్కడ మాత్రం షాక్ అయ్యా!” – మాళవిక మోహనన్
మాళవిక గతంలో రజినీకాంత్ పెట్టా, విజయ్ మాస్టర్, విక్రమ్ తంగలాన్ వంటి పెద్ద చిత్రాల్లో నటించారు. వీటిలో మాస్టర్ మాత్రమే తెలుగులో హిట్ అయినప్పటికీ, టాలీవుడ్ ఆడియన్స్ ఆమెను ఎప్పుడూ ప్రేమగా స్వాగతించారు.
ఇప్పుడు తన ఆఫిషియల్ తెలుగు డెబ్యూ గురించి మాళవిక ఇలా అన్నారు—
“మొదట నేను రెండు–మూడు సీన్స్ ఉంటాయనుకున్నా. స్టార్ హీరో సినిమాల్లో సాధారణంగా హీరోయిన్‌కి రెండు పాటలు, కొద్దిపాటి స్కోప్ మాత్రమే ఉంటుంది కదా… కానీ ది రాజా సాబ్లో నాకు షాకింగ్‌గా మంచి పాత్ర ఇచ్చారు. ఇది స్ట్రాంగ్ ఫిమేల్ లీడ్ రోల్. ఇదే నా తెలుగు డెబ్యూ కావడంతో చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. సినిమా జనవరి 9 సంక్రాంతికి రిలీజ్ అవుతోంది.”
ప్రభాస్‌తో రొమాంటిక్ సీన్స్… అంతేనా? కీలక సీక్వెన్స్‌ల్లో కూడా మాళవిక!
ది రాజా సాబ్లో మాళవికతో పాటు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా హీరోయిన్లుగా ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన టీజర్, ట్రైలర్ చూస్తే మాళవిక–ప్రభాస్ మధ్య రొమాంటిక్ టచ్ కనిపిస్తోంది. అయితే ఇండస్ట్రీ టాక్ ప్రకారం— అమ్మాయి కేవలం గ్లామర్ కోసమే కాదు… సినిమాలో కీలక ట్విస్టుల్లో కూడా మాళవిక పాత్ర ప్రధానంగా ఉంటుందని ప్రచారం!
క్లైమాక్స్
ది రాజా సాబ్పై క్రేజ్ ఏ స్థాయిలో ఉందో టీమ్ ఒక్క లైన్ చెప్పినా వైరల్ అవుతోంది. ఇప్పుడు మాళవిక చెప్పిన ఈ కొత్త డీటైల్స్—రోల్ పరంగా ఎక్కువ స్కోప్, కీలక సీన్స్, ప్రభాస్‌తో కెమిస్ట్రీ—అభిమానుల్లో మరింత ఎక్సైట్మెంట్ పెంచుతున్నాయి!
