మోహన్‌లాల్ (Mohanlal) నటించిన ‘ఎల్2 : ఎంపురాన్’ (L2: Empuraan) సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఇందులో కొన్ని సన్నివేశాలను చూపించారు.
అల్లర్ల సమయంలో ఒక కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం.. కొంతకాలానికి అతడే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటి అంశాలతో సాగిన ఈ సన్నివేశాలను పలువురు తప్పుపడుతున్నారు.
ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఈ సీన్స్ ఉన్నాయని అంటున్నారు. పృథ్వీరాజ్ దర్శకత్వాన్ని విమర్శిస్తూ నెట్టింట వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఎల్2: ఎంపురాన్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు కేంద్ర ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించే విధంగా ఉండటంతో ఈ సన్నివేశాలని మళ్ళీ రీ ఎడిట్ చేస్తున్నారు. అలాగే విలన్ బాబా బజరంగీ పేరుని కూడా మార్చి ఈ రీ ఎడిట్ వెర్షన్ ని గురువారం (ఏప్రిల్ 3) రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా అబ్జెక్షన్ అనిపించిన 17 కత్తిరింపులతో కొత్త వెర్షన్ రీ సెన్సార్ చేయించినట్టు మల్లువుడ్ సమాచారం. కొన్ని పాత్రల పేరు మార్చడంతో పాటు కాంట్రవర్సీకి దారి తీసిన పృథ్విరాజ్ చైల్డ్ ఎపిసోడ్ లోని రేప్ సీన్ సైతం ట్రిమ్ చేసినట్టు వినికిడి. వీటి వల్ల తెలుగుతో పాటు ఇతర డబ్బింగ్ వెర్షన్లకు ఒరిగే ప్రయోజనం ఏమి లేదు.